ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్
ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం(నవంబర్ 16,2019) ఉదయం జేఏసీ నేతలు దీక్షకు కూర్చున్నారు. నేతల ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం(నవంబర్ 17,2019) పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ జేఏసీ నేతలు దీక్షను కంటిన్యూ చేశారు. కాగా, సోమవారం(నవంబర్ 18,2019) రాత్రి ఆల్ పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి జేఏసీ నేతలతో దీక్ష విరమింపజేశారు.
నవంబర్ 19న తలపెట్టాలనుకున్న సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సమ్మెపై తుది నిర్ణయాన్ని మంగళవారం(నవంబర్ 19,2019) సాయంత్రం ప్రకటిస్తామన్నారు.
సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. కోర్టు తీర్పుని గౌరవించి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. కార్మికులతో చర్చలు జరపాలని, సమస్యని పరిష్కరించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ సమ్మెపై రేపు సాయంత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అనే ఆసక్తి నెలకొంది.