పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ గడువు దగ్గర పడేకొద్దీ.. రాజకీయాలను స్పీడప్ చేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ.. అందుకు సంబంధించి అన్ని రూట్లు క్లియర్ చేసింది. అయితే మధ్యలో అనూహ్యం పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్వయంగా సబితతో మాట్లాడటంతో వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇది జరిగి 24 గంటలు గడకముందే.. మళ్లీ సబిత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Read Also : ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా
మార్చి 13వ తేదీ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ఆమె. కుమారుడితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ముగ్గురు కుమారులతో కలిసి రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామాలతో సబిత ఫ్యామిలీ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తేలిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలపైనా చర్చ జరుగుతుంది. సబితకు మంత్రి పదవితో గౌరవించాలని భావించినట్లు సమాచారం. అదేవిధంగా.. కుమారుడు కార్తీక్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వటం అనేది కూడా ప్రధాన పాయింట్ గా చెబుతున్నారు. ఎంపీ సీటు సాధ్యంకాకపోతే.. ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలనే డిమాండ్ సబిత పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్ల విషయంపై అటు టీఆర్ఎస్, ఇటు సబిత ఫ్యామిలీ స్పందించలేదు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇదే సీటు నుంచి కార్తీక్ రెడ్డిని పోటీకి దించుతారనే ఓ ప్రచారం కూడా జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.. రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడిన బుజ్జగించినా.. సబిత వినకపోవటంతో కాంగ్రెస్ నేతలు కూడా చేతులెత్తేశారు.
Read Also : ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో పోటీ