శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో సహస్ర కలశాభిషేక మహోత్సవం

  • Publish Date - November 1, 2019 / 04:29 AM IST

శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటితో ( నవంబర్ 1)తోముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలో శ్రీరాముడికి సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతోంది. స్వామి  వారి ఆరాధ్యదైవమైన శ్రీరాముడికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

ఈ వేడుకల్లో భాగంగా..అనుగ్రహ భాష్యం చేసిన చిన జీయర్ స్వామి మాట్లాడుతూ..ప్రజల్ని అనుగ్రహించటం కోసం శ్రీరాముడు నడిచి వచ్చి అనుగ్రహించిన  రోజు అని అన్నారు.  గతంతో శ్రీరాముడికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించగా 1995 నుంచి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజలపై భగవంతులు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నిరూపించిన రోజు ఈ రోజు అందుకే సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని నిర్వహించామని  శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.