రెండోరోజు : పతంగుల జోరు, స్వీట్ ఫెస్టివల్ మజా 

  • Publish Date - January 14, 2019 / 09:55 AM IST

హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా  కొనసాగుతోంది. మరోపక్క  మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగుతోంది. జనవరి 15 వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు 20 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో రూపొందించిన పతంగులను ఎగురవేస్తున్నారు. 1200 రకాల మిఠాయిలతో అమ్మకాలు, ప్రదర్శన నిర్వహిస్తున్నారు. జనవరి 13న ఈ ఫెస్టివల్ ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉత్సవంలో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వీట్‌ ఫెస్టివల్‌ను సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుండగా..సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ జరుగతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలకు వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు.