తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అవసరమైతే పోలీస్ బందోబస్తు మధ్య సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమ్మెలో పాల్గొనే కార్మికులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
పోలీసు యంత్రాంగం తక్షణ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతీ డిపోకి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే చట్టం తన పని అమలు చేస్తూ ఒకటే స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోవాలని.. అప్పుడే లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుందన్నారు.