గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు : నిర్మాణంలో లోపాలున్నట్లు అనుమానం

హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గచ్చిబౌలి ఫ్లైవర్‌పై ప్రమాదాలకు కారణమేంటి? డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

  • Publish Date - November 23, 2019 / 03:19 PM IST

హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గచ్చిబౌలి ఫ్లైవర్‌పై ప్రమాదాలకు కారణమేంటి? డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గచ్చిబౌలి ఫ్లైవర్‌పై ప్రమాదాలకు కారణమేంటి? డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నిపుణులు ఫ్లై ఓవర్‌పై పరిస్థితిని అధ్యయనం చేయనున్నారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై నుంచి కారు కిందపడిన ఘటనలో.. రోడ్డు పక్కన నిలబడ్డ సత్యవాణి  మృతి చెందారు. సత్యవాణి కూతురు ప్రణీత, ఆటో డ్రైవర్ బాలునాయక్‌, కుబ్రా అనే మహిళ గాయడ్డారు. వీరికి కేర్‌ ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అటు మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌.  గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు కిందకు పడిపోయిన ఘటనతో  ఫ్లైఓవర్ నిర్మాణంపై వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఓ ప్రమాదం ఇదే ప్రదేశంలో జరగడంతో నిర్మాణ పరంగా ఏమైనా లోపాలున్నాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అని మరోసారి అధ్యయనం చేస్తామని సీపీ స్పష్టం చేశారు.