అంతా రామయం : ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని

  • Publish Date - April 14, 2019 / 01:33 AM IST

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వస్తున్నారు. వేలాది దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో కల్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో 18వ తేదీన నిండు పున్నమి వెలుగుల్లో సీతారాముల కల్యాణం జరగనుంది. కొన్ని ప్రాంతాల్లో శనివారమే(ఏప్రిల్ 13,2019) శ్రీరామనవమి పండగను జరుపుకున్నా.. అత్యధిక దేవాలయాల్లో ఆదివారం(ఏప్రిల్ 14,2019) ఉత్సవాలు జరుపుతున్నారు.

పుత్ర కామేష్టియాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాల్లో ఉంది. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. ఛైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడు జన్మించగా.. ఈ రోజును హిందువులు నవమి పేరుతో పండగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు చేసి సీతారామ కళ్యాణం జరుపుతారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటాడు. అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి నరుడై జన్మిస్తాడని పురాణాల్లో ఉంది.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ చీఫ్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనకు మార్గదర్శి అని చంద్రబాబు అన్నారు. సమస్యల నుంచి పారిపోకుండా, సంక్షోభాలను ఎదుర్కొని ఎలా విజయాలు సాధించవచ్చో శ్రీరాముడు లోకానికి చాటారని చెప్పారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు