హైదరాబాద్ నగరం శంషాబాద్ లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు భారీగా హాజరయ్యారు. కమలానంద భారతి స్వామి,విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామనుజ పెరియర్ జీయర్ స్వామి, మైసూర్ అవదూతా దత్తపీఠాధిపతి సచిదానంద స్వామి, దత్త విజయానంద స్వామి,మైహోం అధినేత జూపల్లి రామేశ్వ రావు పాల్గొన్నారు.
ఈ మహోత్సవంలో భాగంగా చిన జీయర్ స్వామి పురస్కారాలను ఇద్దరు వేద పండితులకు ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకల్లో సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం పాదపూజ, దిశ్వ దేశ ఆలయ మర్యాదలు వంటి పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఆయన్ని చినజీయర్ స్వామి సత్కరించారు.