తగ్గించొద్దు: కొత్త ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేయండి

కొద్ది నెలల క్రితం కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పేర్కొన్న నియమాలను బట్టి వాహనాదారులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఫైన్ అమౌంట్లను పెంచుకుండా పాత జరిమానాలనే కొనసాగిస్తున్నాయి. వాటిలో ఏ మాత్రం ఉపేక్షించకూడదని కొత్త ధరలనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

మోటారు వాహన(సవరణ చట్టం)-2019 పార్లమెంటులో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లేకుండా అందులో పేర్కొన్న దానికంటే తక్కువ జరిమానాలు విధించరాదని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. చట్టంలో పేర్కొన్న దాని కంటే తక్కువ జరిమానాలు విధించాలని ఓ రాష్ట్రం చూసినందున న్యాయశాఖ సలహా తీసుకుంది. 

కొన్ని నేరాల్లో గుజరాత్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖాండ్ లు జరిమానాలను తగ్గించాయని కేంద్రం వెల్లడించింది.