తహశీల్దార్ హత్య కేసు : నిందితుడు సురేశ్‌ పరిస్థితి విషమం

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేశ్‌కు మేల్ బర్నింగ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్

  • Publish Date - November 5, 2019 / 03:09 PM IST

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేశ్‌కు మేల్ బర్నింగ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేశ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలోని మేల్ బర్నింగ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్ శరీరం 65 శాతం కాలింది. 74 గంటలు దాటితే తప్పా ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో సురేశ్ కు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు అతడికి ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు.

ప్రస్తుతం అతడు న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నాడు. 24 గంటలు దాటితే స్కిన్‌ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, తహసీల్దార్ హత్య కేసులో సురేశ్ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. అటు తహసీల్దారు విజయారెడ్డిని రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 5,2019) మృతి చెందాడు.

నాగోల్ లోని స్మశాన వాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, స్థానికులు, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశ్రునయనాలతో తుడి వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాలతో విజయారెడ్డి అంత్యక్రియలు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన విజయారెడ్డి స్పాట్ లోనే చనిపోయారు. సోమవారం(నవంబర్ 4,2019) మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి ఛాంబర్‌లోనే ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దార్ ను కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేశ్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దారు ఛాంబర్‌కు వెళ్లాడు. తలుపులు వేసి విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో సురేశ్‌తో పాటు తహశీల్దారు డ్రైవర్, అటెండర్ కి కూడా మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి.