దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్దకు తీసుకొచ్చారు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులపైకి నిందితులు దాడికి యత్నించిరు. పారిపోతున్న వీరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
తర్వాత…ఫారూఖ్ నగర్ తహశీల్దార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. నలుగురి మృతిదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీపీ సజ్జనార్ ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంచనామా నిర్వహించిన అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడనున్నారు. మృతదేహాలను ఎక్కడకు తరలిస్తారో తెలియరాలేదు.
మరోవైపు తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్‌లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రియల్ లైఫ్ సింగం అంటూ ఒకరు, నేరస్తులకు ఎన్ కౌంటర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీసు అధికారి తెలంగాణాలో ఉన్నందుకు గర్వంగా ఉందని మరొకరు..పోలీసుల చర్యతో ప్రజలు సంతోసంగా ఉన్నారని ఇంకొందరు అటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నిందితుల ఎన్‌కౌంటర్ పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అసలు నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించం.. కానీ అంతకు మించి న్యాయం జరిగిందని అన్నారు. అసలు ఇది ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు అని అన్నారు.