ట్యాంక్ బండ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత

ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.

  • Publish Date - November 9, 2019 / 01:09 PM IST

ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.

ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. యథావిథిగా వాహనాల రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్ బండ్ తో పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు విధించారు.

సాయంత్రం పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. అటు వెళ్లే వాహనదారులు రిలీఫ్ అయ్యారు. ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరకయాతన అనుభవించారు.

ఆర్టీసీ కార్మికుల జేఏసీ చలో ట్యాంక్ బండ్ కి పిలుపునివ్వడంతో.. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్యాంక్‌ బండ్ చుట్టూ బారికేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేసిన పహారా కాశారు. కాగా మధ్యాహ్నం సమయంలో ఆందోళకారులు దూసుకురావడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. లిబర్టీ దగ్గర నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం ఉద్రిక్తకు దారితీసింది.