అసలేం జరిగింది : పెద్ద శబ్దం చేస్తూ నిలిచిపోయిన మెట్రో రైలు.. పట్టాలపైనే దించేశారు

హైదరాబాద్‌ అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో రైల్‌ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం

  • Publish Date - November 19, 2019 / 03:22 PM IST

హైదరాబాద్‌ అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో రైల్‌ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం

హైదరాబాద్‌ అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో రైల్‌ కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పట్టాలపై నిలిచిపోయింది. దీంతో లోపలున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక టెన్షన్‌ పడ్డారు. పట్టాలపై మెట్రో రైల్‌ నిలిచిపోవడంతో అమీర్‌పేట్‌-బేగంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

విద్యుత్‌ సరఫరాలో లోపం వల్లే మెట్రో రైల్‌ నిలిచిపోయిందని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అప్పటిదాకా బేగంపేట్‌, అమీర్‌పేట్‌ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్‌లో రైళ్లు నడుపుతామని చెప్పారు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న రైలు సడెన్ గా ఆగింది. అమీర్‌పేట స్టేషన్‌లో 45నిమిషాలుగా మొరాయించింది. మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎగ్జిట్ డోర్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు.