హైదరాబాద్: తెలంగాణలో 3 వేల పెట్రోలు పంపుల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సందబంధించి కొన్ని ప్రతిపాదలను కూడా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంక్ ల కంటే అదనంగా మరో మూడు వేల పెట్రోల్ బంక్స్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని యోచిస్తున్న అసోసియేషన్స్ హైకోర్టును ఆశ్రయించేయోచనలో వున్నారు.
“కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన కమిటీలు అందించిన నివేదికల ప్రకారం, పెట్రోల్ పంపులు కనీసం 170 కిలో లీటర్స్ అమ్మకాలు జరుగుతున్న క్రమంలో 70 శాతం పెట్రోల్ పంపులను 170 KL విక్రయాలకు తక్కువగానే వున్నాయి. ఇది ఇప్పటికే పెట్రోల్ బంక్స్ యాజమాన్యాలకు నష్టదాయకంగానే కనిపిస్తోంది.ఇది కూడా పర్యావరణ ఆందోళన అంశమని “తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ తెలిపారు. కాగా తెలంగాణలో ప్రతిపాదించిన 3వేల కొత్త పెట్రోలియం పంపుల కోసం, చమురు కంపెనీలు 6,000 దరఖాస్తులను అందుకున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో 2వేల 800ల పెట్రోల్ బంక్స్ వున్నాయి. వీటిలో జీహెచ్ ఎంసీ పరిధిలో 600లున్నాయి. వీటిలో సుమారు 300 బంకులు నష్టాల్లో కొనసాగుతుండటంతో సరిగా పనిచేయటంలేదని..జీహెచ్ ఎంసీ పరిధిలోకి రానివి..సీటి శివార్లలో 100 బంక్స్ ఉన్నాయనీ.. GHMC పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సకార్యదర్శి అమరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో తెలంగాణ పెట్రోల్ కంపెనీల కోఆర్డినేటర్ రాజేష్ తుంగభద్ర మాట్లాడుతూ..పెట్రోలియం శాఖ తెలంగాణకు 3వేల పెట్రోల్ బంక్స్ ఏర్పాటు ప్రతిపాదన అంశం సాధ్యాసాధ్యాలపై మాట్లాడాల్సి ఉందని..దీనికి సంబంధించి 3 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు.
నగరంలో పెట్రోల్ బంక్స్ వల్ల ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ వల్ల ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ ఇంటి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుందంటూ చెబుతున్నారు. తొలగించాలని గతంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ హైకోర్టులో పిటీషన్ కూడా వేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ పెట్రోల్ బంక్ మీరు ఇల్లు కట్టుకోక ముందు నుంచి ఉందన్న విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాతే మీరు ఇల్లు కట్టుకున్నారనీ..ఈ పెట్రోల్ ను తీసి వేయటం కుదరదనీ కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.