CAA ఎఫెక్ట్ : బర్త్‌ సర్టిఫికెట్స్ కోసం వెల్లువెత్తుతున్న అప్లికేషన్లు..తలలు పట్టుకుంటున్నఅధికారులు

  • Publish Date - February 26, 2020 / 06:48 AM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బర్త్‌ సర్టిఫికెట్ల కావాలంటూ GHMC అధికారులకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అంటే హైదరాబాద్‌లో జననాల సంఖ్య పెరుగుతోందని అనుకోవటానికి వీల్లేదు. కానీ తాము హైదరాబాద్ లోనే పుట్టామని నిరూపించుకోవాటానికి కావాల్సిన బర్త్ సర్టిఫికెట్లు కావాలని ఇటీవల కాలంలో అప్లికేషన్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్లికేషన్లలో రోజుల వయస్సున్న పిల్లలతో పాటు వృద్ధుల వరకూ ఉన్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. 

2019 డిసెంబర్, 2020 జనవరిలలో GHMC  జారీ చేసిన సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. 2020 జనవరి 1న 88 మంది పురుషులకు బర్త్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు అధికారులు. వారిలో 38 మంది ఒకే వర్గానికి చెందినవారుకాగా..అదేరోజు 101 మంది మహిళలకు బర్త్‌ సర్టిఫికెట్లు మంజూరవ్వగా..వారిలో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనించాల్సిన విషయం. 

అదే 2019 జనవరి 1న  ఇందులో సగం మంది మాత్రమే అప్లై చేసుకున్నారనీ ఇది చాలా ఆశ్చర్యమనీ ఓ అధికారి అన్నారు. గత డిసెంబర్ జనవరిల నుంచి ప్రతీ రోజూ 100 శాతం అప్లికేషన్లు పెరిగాయని అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే 1936లో జన్మించిన నాకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వండి అంటూ వస్తున్నారనీ..అది ఏకంగా నిజాం కాలంనాటి సంవత్సరాలనీ వాటికి సర్టిఫికెట్లను కూడా అడుగుతున్నారని వాపోతున్నారు.

86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు వచ్చి బర్త్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారనీ వారికి బర్త్ సర్టిఫికెట్ తో పనేంటని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. భారత స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం పాలన కాలంలోని బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్‌ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది మరి. వాటిలో 99 శాతం అప్లికేషన్లలో చాలామంది డేటా దొరకట్లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు దరఖాస్తుల విచారణ కోసం పంపుతున్నారు. 

See Also>>సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్

 

మరోపక్క వక్ఫ్‌ బోర్డుకు కూడా మ్యారేజ్ సర్టిఫికెట్స్ కావాలంటూ అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి.  గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు వస్తే..2020 జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా అప్లికేషన్లు వస్తున్నాయట. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత వంటి అన్ని వివరాలు ఉండటం గమనార్హం. రోజు రోజుకు పెరుగుతున్న అప్లికేషన్లను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులే ఆశ్చర్యపోతున్నారు. 

పాతబస్తీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్‌పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్నారు. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న క్రమంలో వీరంతా బర్త్, మ్యారేజ్‌ సర్టిఫికెట్లకు తప్పుడు అప్లికేషన్లు చేసుకుంటున్నారనీ అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు చాలామంది కొత్తగా బర్త్ సర్టిఫికెట్లు కావాలని అడుగుతుండటంతో..వాటిలో అనుమానాస్పదంగా..రికార్డుల్లోలేని అప్లికేషన్ల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇలా బర్త్ సర్టిఫికెట్ల కోసం వెల్లువెత్తుత్తున్న అప్లికేషన్లతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.