అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు మల్లి భట్టి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేసిన విమర్శలను ఖండించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని..ఆరేళ్లలో రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశామా ? నిరూపిస్తారా ? అంటూ సవాల్ విసిరారు. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చర్చ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కనిపించడం లేదా భట్టి విక్రమార్క..భక్త రామదాసు ప్రాజెక్టు కనిపించలేదా ? మిషన్ భగీరథ ప్రాజెక్టు కాదా ? నిలదీశారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ అద్బుతమన్నారని, దాదాపు 20 లక్షల మంది ప్రజలు చూశారని చెప్పారు. ఐదు సంవత్సరాల్లో పాడిందే పాటగా విమర్శలు చేస్తున్నారు..ఇప్పడు కూడా సేమ్ టు సేమ్ ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
గత ఎన్నికలు, ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో తీరు మారలేదని విమర్శించారు. ఏది పడితే..అలా మాట్లాడడం సరికాదని..మరొక్కసారి చెబుతున్నట్లు సీఎం కేసీఆర్ సూచించారు.
Read More : రాష్ట్రాన్ని దివాళా తీయించామా..సభను తప్పుదోవ పట్టించొద్దు