మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు – సీఎం కేసీఆర్

  • Publish Date - September 15, 2019 / 08:13 AM IST

మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. లక్షా 44 వేల 382 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. 

ఉద్యోగాల భర్తీలపై కేసులు వేస్తారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మీ పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిరుద్యోగులను ఎంతకాలం మభ్యపెడుతారని సూటిగా ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు పారదర్శకంగా ఖర్చు చేయడం జరిగిందని, దళితులను తమ ప్రభుత్వం పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేసే వారిపై నిందలు వేయవద్దని హితవు పలికారు.

ఏ ప్రభుత్వం చేయని పనులు తమ ప్రభుత్వం చేస్తోందని..పథకాల గురించి వివరించారు. నిరంతర విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని, ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. కొత్తగా 25 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు ఇస్తామన్నారని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని..ఇలా ఎన్నో హామీలు గుప్పించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నారు సీఎం కేసీఆర్.