తెలంగాణ బడ్జెట్ 2019 : ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్‌ను

  • Publish Date - September 9, 2019 / 07:50 AM IST

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్‌ను

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈసారి బడ్జెట్ లెక్క తగ్గింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు కేసీఆర్ వివరించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్ష 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియనుంది. దీంతో 2019-20కు పూర్తిస్థాయి వార్షిక పద్దును కేసీఆర్‌ సభ ముందు ఉంచారు. రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. 

బడ్జెట్ 2019 కేటాయింపులు :
మొత్తం బడ్జెట్ రూ.1,46,492 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ. 1,336 కోట్లు కేటాయింపు
గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు అందించాలని నిర్ణయం
రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటివరకు రూ.20,925 కోట్లు ఖర్చు
ఉదయ్‌ పథకం ద్వారా రుణభారం రూ.9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది
విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది
గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు
పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు
రైతుబంధు పథకానికి రూ. 12వేల కోట్లు
రైతు రుణమాఫీకి రూ. 6వేల కోట్లు
రైతు బీమాకి రూ. 1125 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు
అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం
ఐదేళ్లలో రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2లక్షల 27వేల 926 కోట్లు
ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే
2018-19 నాటికి రాష్ట్ర సంపద రూ.8, 65, 688 కోట్లుగా నమోదు
ఐదేళ్లలో వృద్ధి రేటు 6.3 శాతం
2018-19లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 8.1 శాతం
2018-19లో వృద్ధి రేటు 11.5 శాతం
57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పించన్లు
రైతు బంధు సాయం రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంపు