తెలంగాణ బడ్జెట్ 2019 లో సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారు. రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుబంధు పథకంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. బడ్జెట్ లో రైతు బంధు కోసం రూ.12వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1,137 కోట్లు కేటాయించారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2019 లెక్క తేలింది. ఈసారి బడ్జెట్ పరిమాణం తగ్గింది. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు. మూల ధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.67 కోట్లు. ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ 2019 కేటాయింపులు:
* రైతుబంధు, రైతు బీమా పథకాలు కొనసాగుతాయి
* ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లు
* కేంద్ర పథకాల అమలు కోసం రూ.31,802 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు
* రైతుబంధు కోసం రూ.12వేల కోట్లు
* రైతు బీమా కోసం రూ.1,137 కోట్లు
* విద్యుత్ సబ్సిడీ కోసం రూ.8వేల కోట్లు
* గ్రామ పంచాయతీలకు రూ.2వేల 714 కోట్లు
* మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు
* విద్యుత్ సబ్సిడీలకు రూ.8వేల కోట్లు
* రైతులకు ఇచ్చే సాయం ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలు పెంపు