నవంబర్ 28న తెలంగాణ కేబినెట్ ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌టీసీ సమ్మె సమస్యపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 29న కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 52 రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించనున్నారు.
ఆర్టీసీ సమస్య కొనసాగుతున్న క్రమంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ఆర్టీసీ కార్మికులతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలంతా ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? అనే విషయంపై అత్యంత ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
52 రోజులుగా సమ్మెను కొనసాగించిన ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు దిగి వచ్చారు. విధుల్లో చేరతామంటూ మంగళవారం (నవంబర్ 26)న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.కానీ విధుల్లో చేరేందుకు వచ్చిన కండక్టర్లను..డ్రైవర్లను, ఇతర ఉద్యోగులకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. 52 రోజుల పాత సమ్మెను ఆర్టీసీ జేఏసీ విరమించుకుని..మంగళవారం విధుల్లో చేరేందుకు వచ్చారు. కానీ అన్ని డిపోల్లోను భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర పోలీసులు భారీగా మోహరించి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమ్మె విరమించిన కార్మికులు ఉదయం 6 గంటల నుండే గుంపులుగా వచ్చారు, కాని పోలీసులు డిపోలలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు.సమ్మెను విరమించుకుంటున్నామని తెలిపిన జెఎసి నిర్ణయాన్ని ఆర్‌టిసి యాజమాన్యం కొట్టిపారేసింది. జేఏసీ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ..కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ స్పష్టం చేశారు. దీంతో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నెల 28న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో జరుగనుంది. మరుసటి రోజు శుక్రవారం కూడా సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) November 26, 2019
రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.
— Telangana CMO (@TelanganaCMO) November 26, 2019