తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్(విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.(జనవరి 26, 2020) సీఎం కేసీఆర్, మంత్రుల చేతుల మీదుగా ఈ పతకాలను అందించనున్నారు.
ఆయా పోలీసు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి తెలంగాణ స్టేట్ పోలీస్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్) పతకాలు, పోలీస్ సేవా పతకాలు, తెలంగాణ స్టేట్ శౌర్య పతకం, తెలంగాణ స్టేట్ పోలీస్/ఫైర్ సర్వీసెస్/ఎస్‌పీఎఫ్ మహోన్నత సేవా పతకం, తెలంగాణ స్టేట్ పోలీస్/ఫైర్ సర్వీసెస్/ఎస్‌పీఎఫ్ ఉత్తమ సేవా పతకం, తెలంగాణ స్టేట్ పోలీస్ కఠిన సేవా పతకాలను అందించనున్నారు.