రూ.40కే కిలో ఉల్లిగడ్డ : తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

  • Publish Date - November 26, 2019 / 03:55 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతో వ్యాపారులతో వ్యవసాయశాఖ కార్యదర్శి చర్చించారు. కిలో ఉల్లిగడ్డ రూ.40కే ప్రభుత్వానికి ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. 

హమాలీ, రవాణా ఛార్జీలను మార్కెటింగ్‌శాఖ భరించనుంది. బుధవారం నుంచి నగరంలోని మోహదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్ లో కిలో ఉల్లగడ్డ రూ.40కే లభించనుంది. దశల వారీగా అన్ని రైతుబజార్లలో ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక వినియోగదారునికి ఒక కిలో ఉల్లిగడ్డ మాత్రమే విక్రయించనున్నారు.