వావ్..చిలుకల జంట సూపర్ : మురిసిపోయిన గవర్నర్ తమిళిసై

  • Publish Date - December 9, 2019 / 09:19 AM IST

ఓ చిలుక జంట తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మనస్సును దోచుకున్నాయి. రాజ్‌భవన్‌లో ఎన్నో వృక్ష జాతులు ఉన్న విషయం తెలిసిందే.  ఈ చెట్లలో ఓ చెట్టు చిటారు కొమ్మన రెండు చిలుకలు కిలకిలలాడాయి. చిలుకపలుకులతో కువకువలాడాయి. ఆ చిలుకల జంట ప్రేమ ముచ్చట్లకు గవర్నర్ మైమరచిపోయారు. ఆ దృశ్యాలను గవర్నర్‌ తమిళిసై తన ఐప్యాడ్‌ కెమెరాలో బంధించారు. వాటిని తన ట్విట్టర్ లో పోస్ట్  చేశారు. 

మరో చెట్టుపై చిలుకల గుంపు దృశ్యాలను కూడా గవర్నర్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. ఈ ప్రేమ పక్షులు గవర్నర్‌ మనసును దోచుకున్నాయి. హైదరాబాద్ ఎన్నో అందాలకు నిలయమని గవర్నర్ తెలిపారు. 

పక్షుల్ని చూస్తే మనస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తేఒత్తిడితో ఉన్న మనస్సుకి కూడా రిలీఫ్ కలుగుతుందని సైకాలజిస్టులు కూడా చెబుతుంటారు. ఇక చిలుకల్ని చూస్తే ఎవ్వరైనా సరే ఆనందపడతారు. ఆటువంటి చిలుల ప్రేమ జంటను చూసిన గవర్నర్ తమిళసై తెగ మురిసిపోయారు.