సంస్కృతీ,సంప్రదాయం..టెక్నాలజీ. ఇదీ నేటి యువత సృజనాత్మకత. పండుగలు వస్తే సంప్రదాయాన్ని పాటిస్తూనే..ఉద్యోగంలో భాగంగా టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా ఇటు సంప్రదాయాన్నీ..అటు టెక్నాలజీల మేళమింపుతో బతుకమ్మను తయారీకి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ టెకీలు. ఈ వినూత్న కార్యక్రమంతో టెక్నాలజీతో తెలంగాణ బతుకమ్మ రూపు దిద్దుకోనుంది. మరి ఆ విశేషాలేమంటో తెలుసుకుందాం..
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఐటీ హబ్ గా హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో బతుకమ్మ సంబురాలను సందేశాత్మకంగా నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూలతో దర్శనమిచ్చే బతుకమ్మను టెక్రాలజీతో రూపొందించనున్నారు. ఐటీ రంగంలో కొత్తగా..ఉత్తమ ఉపాధి వేదికలుగా నిలుస్తున్న తొమ్మిది టెక్నాలజీస్‌తో టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) ఆధ్వర్యంలో శుక్రవారం (అక్టోబర్ 4)న బతుకమ్మ సంబురాలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఈ టెక్ బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమలశాఖల చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ ఎంతగానో ప్రశంసించారు. ఐటీ రంగంలో ఉపాధి కోరుకుంటున్న యువత ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్‌పై పట్టు సాధించేల ప్రేరణ కలిగించేందుకు సాంకేతిక బతుకమ్మను చేపట్టినట్టు టీటా ఫౌండర్ సందీప్‌కుమార్ మక్తాల తెలిపారు.
టెక్నాలజీ బతుకమ్మ
– బతుకమ్మ గోపురం 3డీ ప్రింటింగ్ డిజైన్‌తో రూపొందించబడి ఉంటుంది.
– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్(ఐవోటీ) ఆధారంగా బతుకమ్మ ఓపెన్ అవుతుంది.
– రోబోటిక్స్ రోవర్ సహాయంతో బతుకమ్మ తన చుట్టూ తాను తిరుగుతుంది.
– డ్రోన్ సహాయంతో ఆ పరిధిలో బతుకమ్మ చక్కర్లు కొడుతుంది. ఇలా పలు సాంకేతిక విశిష్టలతో బతుకమ్మ రూపుదిద్దుకోనున్నది.