బడ్జెట్ కు సభ ఆమోదం : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా 

  • Publish Date - February 25, 2019 / 09:54 AM IST

హైదరాబాద్ : అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ పై చర్చను శాసనసభ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విపక్షసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో  ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం పలికింది. 10 లక్షల ఎకరాలను నీరందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే బడ్జెట్ లో ఉద్యోగులకు 43 శాతం జీతాలు పెంచిన ఘటన మాదేనన్నారు. నాలుగు, ఐదు నెలల్లో నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి పథకం అమలు కోసం రూ. 1,810 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.  ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం పలికిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను నిరవధిక వాయిదా వేశారు.