తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గానూ 81 ఓట్లు పోల్ అయ్యాయి.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఆదివారం (ఫిబ్రవరి 9, 2020) జరిగిన ఎన్నికల్లో మొత్తం 84 ఓట్లకు గానూ 81 ఓట్లు పోల్ అయ్యాయి. ముగ్గురు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. వరంగల్ టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన నర్సింగం రెడ్డి, మాజీ ఎంపీ, హుసూస్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎ.ఖాన్, జుడో అసోసియేషన్ ప్రెసిడెంట్ కైలాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగానే సాగింది. మొత్తం 26 మంది బరిలో ఉన్నారు. 5 గంటల తర్వాత ఒలింపిక్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 6 గంటల లోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మొదటి నుంచి కూడా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు అనేక ట్విస్టులు, అనేక పరిణామాలు మధ్య కొనసాగుతోంది. రెండు అసోసియేషన్స్.. మొదట ప్రెసిడెంట్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనున్నారు. తర్వాత ఎన్నికలకు వెళ్లడంతో ముగ్గురు అభ్యర్థులు ప్రొ.రంగారావు, జయేష్ రంజన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రెసిడెంట్ పదివికి బరిలో దిగారు. ముగ్గురిలో జితేందర్ రెడ్డి, జయేష్ రంజన్ నామినేషన్లు రిజక్ట్ అయ్యాయి.
జయేష్ రంజన్…క్యాట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదంటూ అతని రిజక్ట్ చేశారు. రంగారావు పోస్టుకు మరో ప్రెసిడెంట్ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి బలబర్చడంతో అతన్ని నామినేషన్ కూడా రిజక్ట్ చేశారు. జయేష్ రంజన్ తరపున జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జగన్ మోహన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. జయేషే రంజన్ నామినేషన్ తిరస్కరణపై అతను హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో జయేష్ రంజన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అతన్ని నామినేషన్ ఆమోదించాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోర్టు ఆదేశించడంతో ఒక్కసారిగా జయేష్ రంజన్ బరిలోకి వచ్చారు. అతను బరిలోకి రావడంతో ఎన్నికలు కీలక మలుపు తీసుకున్నాయి. ఎవరు అధ్యక్ష పదివిని వరిస్తారోనని మొదటి నుంచి కూడా క్రీడా సంఘాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది.