జనవరి 7కు ముందే జరిగిన ఏకగ్రీవాలు చెల్లవు : నాగిరెడ్డి 

  • Publish Date - January 5, 2019 / 04:43 PM IST

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జనవరి 7కు ముందే జరిగిన ఏకగ్రీవాలు చెల్లవన్నారు. పంచాయతీల ఏకగ్రీవం అనేది ప్రభుత్వ పరంగా ఉన్నదేనని, ప్రోత్సహకాలు ఇస్తాం కానీ బలవంతంగా ఏకగ్రీవం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైతే అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు