రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర శకటం

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.

  • Publish Date - December 19, 2019 / 03:43 PM IST

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.

ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. తెలంగాణ శకటంపై జానపద నృత్యాలు కనువిందు చేయనున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద శకటాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2015లో బోనాలు రూపకాన్ని ప్రదర్శించారు. నాలుగేళ్ల తర్వాత 2020 జనవరి 26వ తేదీన సమ్మక్క సారలమ్మ రూపకాన్ని ప్రదర్శించనున్నారు. దీంతోపాటు వేయి స్తంభాల గుడి, బతుకమ్మ ప్రాధాన్యతలు శకటంపై కొలువుదీరనున్నాయి. 

ఈ మేరకు రక్షణశాఖ ఆధ్వర్యంలోని సెరిమోనియల్ కమిటీ ఆమోదం తెలిపినట్టు ప్రకటనలో పేర్కొన్నది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆయా రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా శకటాలపై ప్రదర్శన ఇస్తారు. 2015లో తెలంగాణ రాష్ట్రం నుంచి శకటానికి అనుమతి లభించింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాలు రూపకాన్ని కళాకారులు ప్రదర్శించారు. తర్వాత బతుకమ్మ, మేడారం జాతరకు సంబంధించిన ఆకృతిని రూపొందించినా చివరి దశలో ఎంపిక కాలేదు.

2020 రిపబ్లిక్ డే రోజున తెలంగాణ శకటానికి చోటు దక్కడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఢిల్లీ వేదికగా ప్రదర్శించబోతున్నామని చెప్పారు. మేడారం, బతుకమ్మ ప్రదర్శనలతో, వేయిస్తంభాల గుడి వేదికగా, కళాకారుల నృత్యాలతో శకట ఆకృతి బాగుందన్నారు. శకటం ఎంపికయ్యేందుకు విశేషంగా కృషి చేసిన రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అభినందించారు.
 

ట్రెండింగ్ వార్తలు