ప్రియాంక హత్య కేసు నిందితులున్న చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్తత : భారీగా తరలి వస్తున్నారు

చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద

  • Publish Date - December 1, 2019 / 08:08 AM IST

చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద

చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద సంఖ్యలో జైలు దగ్గరికి వస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో నలుగురు నిందితులను చర్లపల్లి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి యువకులు, మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో జైలు దగ్గరికి వస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు.

పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా భారీగా బలగాలు మోహరించారు. జైలు దగ్గరికి వస్తున్న వారితో మాట్లాడి వెనక్కి పంపేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు జైలు దగ్గర భద్రతను పెంచారు.

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో… జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు. ఏ1 మహ్మద్‌ ఆరిఫ్‌కు-1979, ఏ2 శివ-1980, ఏ3 చెన్నకేశవులు-1981, ఏ4 నవీన్‌-1982 నెంబర్లను కేటాయించారు. మరోవైపు.. వీరి తరపున ఎవరూ వాదించకూడదని.. బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయ సాయం చేయాలని తెలంగాణ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.