ప్లీజ్ అలర్ట్ : హైదరాబాద్ లో ఈ రాత్రి ఫ్లైఓవర్లు మూసివేత

  • Publish Date - April 3, 2019 / 04:44 AM IST

హైదరాబాద్ లో ఏప్రిల్ 3వ తేదీ రాత్రి సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. దీనికి కారణం ‘జగ్‌నే కి రాత్. ముస్లింలు ఇవాళ రాత్రి ప్రార్థనలు చేయనున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్ ఫ్లైఓవ‌ర్‌, పీవీఎన్‌ఆర్, లంగర్‌హౌస్ ఫ్లైఓవ‌ర్లు మినహా నెక్లెస్‌రోడ్డుతో సహా అన్ని ఫ్లైఓవ‌ర్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ నగర్ సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతోంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, బుద్ధ ఇలా పలు సంప్రదాయాలు హైదరాబాద్ లో కొనసాగుతుంటాయి. ఆయా మతాలకు సంబంధించిన వేడుకలు జరగనున్న క్రమంలో నగర పోలీస్ శాఖ పట్టిష్టమైన చర్యలు తీసుకుంటారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే.. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ‘జగ్‌నే కి రాత్’ సందర్భంగా ఫ్లైఓవర్ల మూసివేత ఉంది. వాహనదారులు సహకరించాలని కోరారు పోలీస్ కమిషనర్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.