హైదరాబాద్ మొత్తంలో ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ బిల్లులే రూ. 63కోట్లకు మించి ఉన్నాయట. కోల్‌కతాలో చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటారు. 25 నుంచి 50% వరకూ కట్టాల్సిన మొత్తాన్ని బట్టి డిస్కౌంట్ కల్పిస్తుంటారు. దీంతో జనాల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడంతో పాటు మరోసారి అలాంటి తప్పు చేయకూడదనే భయమైన మొదలవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆఫర్లే తెలంగాణలో.. అదీ హైదరాబాద్‌లో మొదలవుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు
ఈ విషయంపై గతంలోనూ హైదరాబాద్‌లోని పలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు వాహన యజమానులు వెళ్లారట. మాకు 50శాతం డిస్కౌంట్ ఇస్తే మొత్తం బిల్లులు కట్టేస్తామంటూ బేరాలకు దిగుతుండటంతో అదంతా వట్టి పుకార్లని ఎటువంటి ఆఫర్లు లేవని చలాన్ పెండింగ్ మొత్తం కట్టాల్సిందేనని స్పష్టం చేశారట.
రోడ్డుపై వాహనాలు నడిపేవారిని అదుపుచేయాలని సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, తప్పుడు పద్ధతిలో యూ టర్న్ క్రాస్ చేయడం, రాష్ డ్రైవింగ్‌లకు డిజిటల్ ఫొటోలు తీసి ఫైన్ వేస్తున్నా ఏ మాత్రం కనువిప్పు కలగటం లేదు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో నగరవాసులంతా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు భారీ మొత్తంలో బాకీపడ్డారు. దాదాపు రూ.63 కోట్ల వరకూ బాకీలు చెల్లించాల్సిన వాహనాలే రోడ్డుపైన తిరుగుతున్నాయి.
ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పెండింగ్ లోని 63 కోట్ల రూపాయలు వసూలు చేయటం కోసం.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిస్కొంట్ ఇస్తున్నారనేది దాని సారాంశం. ఈ వార్తలపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే