లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని బాలుడు మృతి 

  • Publish Date - February 27, 2019 / 05:27 AM IST

బాలాజీ నగర్ : బాలాజీ నగర్ : ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు పలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటు..బోరుబావుల్లోను..నీటి సంపుల్లోను..పడి చనిపోతున్నారు చిన్నారులు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్లోని బాలాజీ నగర్ లో ఇటువంటి విషాదమే నెలకొంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని 10 సంవత్సరాల బాలుడు మరణించాడు. 

 

మేడ్చల్లోని బాలాజీ నగర్  అపార్ట్ మెంట్ లిఫ్ట్ గ్రిల్ లో ఇరుక్కుని 10 సంవత్సరాల బాలుడు మరణించాడు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న బాల చందర్ కుమారుడు హేమంత్ కుమార్ స్కూల్ నుంచి వచ్చాడు. డుకుంటు..ఆడుకుంటు లిఫ్ట్ ఎక్కిన సమయంలో గ్రిల్ లో ఇరుక్కున్న హేమంత్ కుమార్ తల ఇరుక్కుపోయి ఊరిపి ఆడక మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన హేమంత్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై అపార్ట్ మెంట్ వాసులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం హేమంత్ కుమారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే   ఆడుకునే చిన్నారులను తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అవసరముంది.