కొత్త సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ

  • Publish Date - February 5, 2019 / 05:00 AM IST

జిల్లాలవారీగా కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే శిక్షకులకు 6న ప్రగతిభవన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 

ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రగతి భవన్లో బుధవారం (ఫిబ్రవరి 6,2019) పంచాయితీ రాజ్ చట్టంపై మాస్టర్ శిక్షకుల సమావేశాన్ని నిర్వహిస్తారు. కొత్తగా అమలులోకి వచ్చిన  పంచాయితీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు నిధుల వినియోగం, విధుల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలపై శిక్షకులకు అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.