చంద్రబాబుని నమ్మొద్దు: ఆంధ్ర ఏమైనా మీ తాతదా?

  • Publish Date - March 9, 2019 / 02:40 PM IST

చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పడం ఆపాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు ఒక్కడే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నాడా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉందని, చంద్రబాబు ఓడిపోయినంక మళ్లీ హైదరాబాదే వస్తాడని అన్నారు. చంద్రబాబు అమరావతిలో ఉండలేడని, రేవంత్‌రెడ్డి కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అన్నారు.

ఎన్నికలల్లో డబ్బులు పంచడం దేశంలో తొలుత ప్రారంభించింది చంద్రబాబేనన్నారు. బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికే హెరిటేజ్ కంపెనీని స్థాపించారని, జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు ఇంటి విలువ రూ.20 కోట్ల పైమాటేనన్నారు. చంద్రబాబు మనుమడు పేరు మీదే రూ.85కోట్ల ఆస్తి ఉందంటూ తలసాని ఆరోపించారు. తమ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నావ్‌ అని చంద్రబాబు అడుగుతున్నారని, ఆంధ్ర ఏమైనా మీ తాతదా.. మేము వస్తాం అన్నారు. చంద్రబాబు చేసేన పనుల వల్ల ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందని అన్నారు.

దొంగ చంద్రబాబుని నమ్మొద్దని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పిలుపునిస్తోందని అన్నారు. ఏపీలో జీరో పర్సంట్‌ అవినీతి ఉంటే తాను రాజీనామా చేస్తానన్నారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైనవారు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఏపిలో చంద్రబాబు కులాల మ‌ద్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు.