బ్లాక్‌ మెయిల్‌కు రేవంత్‌ బ్రదర్స్ పెట్టింది పేరు : ఎంపీ బాల్కసుమన్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్‌ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.

  • Publish Date - March 1, 2020 / 07:29 AM IST

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్‌ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్‌ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. బ్లాక్‌ మెయిల్‌కు రేవంత్‌ బ్రదర్స్ పెట్టింది పేరని.. రేవంత్‌ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. చెప్పేవి నీతులు… చేసేవి ఇలాంటి పనులు అని ఎద్దేవా చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పూర్తి సమాచారం సేకరిస్తామన్నారు. కబ్జా చేసిన భూములు బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 

రేవంత్‌రెడ్డి సోదరులు భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు
గోపన్‌పల్లిలో రేవంత్‌రెడ్డి సోదరులు భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రేవంత్‌రెడ్డి సోదరులు తమ భూములను కబ్జా చేశారంటూ ఆయనపై కొందరు బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మ్యుటేషన్‌కు పాల్పడిన కేసులో రేవంత్‌రెడ్డి సోదరులకి సహకరించారంటూ డిప్యుటీ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డిపై ఇప్పటికే వేటు పడింది. 

బాధితులు ఆర్డీఓకు పిర్యాదు 
దీంతోపాటు 124 సర్వే నెంబర్‌లోని ప్లాట్లను రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారని కొందరు బాధితులు ఆర్డీఓకు పిర్యాదు చేశారు. భూ కబ్జాను అడ్డుకోవడానికి వెళ్లిన తమపై దాడి చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ చంద్రకళకు డాక్యుమెంట్లు, ఆధారాలు అందించారు. గోపన్‌పల్లిలో ఉన్న రాజోల్ ఎస్సీ సొసైటీ 127,128 సర్వే నెంబర్లలో ఉంది. 

ప్రాణాలు తీస్తామని బెదిరించారని సొసైటీ సభ్యులు ఆవేదన
అయితే 127 సర్వే నెంబర్‌లో కొన్ని ప్లాట్లలో ఉన్న నిర్మాణాలను కూలగొట్టి ఆస్థలాన్ని కబ్జా చేశారని, ఈ ఆక్రమణను అడ్డుకోవడానికి వెళ్లిన ఎస్సీ సొసైటీ సభ్యులను కులం పేరుతో దూషించి, ప్రాణాలు తీస్తామని బెదిరించారని సొసైటీ సభ్యులు ఆర్డీవోకి వివరించారు. 2016లో సొసైటి ప్లాట్లలో నిర్మించిన రెండు నిర్మాణాలను కూలగొట్టి ఆ స్థలాన్ని కబ్జా చేశారని బాధితులు వాపోతున్నారు.