మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమించిన సంగతి తెలిసిందే.
వీరిలో డ్రైవర్లకు రోజుకి రూ.1500, కండక్టర్లకు రూ. 1000 రోజువారీ వేతనంగా ఆర్టీసీ ఇస్తోంది. ఐటీ ట్రైనర్ గా తీసుకున్న సాఫ్ట్ వేర్ నిపుణులకు రోజుకి రూ.1500 జీతం ఇస్తోంది.
మరికొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రవాణా, పోలీస్ శాఖలో రిటైర్డ్ డ్రైవర్ల నుంచి కూడా దరఖాస్తులు కోరారు. మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన సర్టిఫికెట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, జిల్లా రవాణ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో పారితోషికం చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు:
* డ్రైవర్
* కండక్టర్
* మెకానికల్ సూపర్ వైజర్స్
* మెకానిక్
* శ్రామిక్
* ఎలక్ట్రీషియన్
* టైర్ మెకానిక్
* క్లరికల్ సిబ్బంది
* ఐటీ ట్రైనర్