TS RTC పార్సిల్స్ హోం డెలివరీ

  • Publish Date - December 11, 2020 / 01:07 PM IST

TSRTC Parcel Home Delivery : తెలంగాణ ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూర్చే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే కార్గో, పార్సిల్, కొరియర్ సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు బస్టాండ్లు, బస్ డిపోల వరకే పార్సిళ్లు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. కార్గో, పార్సిల్ సేవలు ఇంటి వద్దనే లభించనున్నాయి. హోం డెలివరీ చేస్తే..అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. GHMC పరిధిలో ఈ పార్సిల్స్  హోం డెలివరీ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి.



ఛార్జీలు ఇలా…
కేజీ లోపు నుంచి 10 కేజీల వరకు రూ. 80. 101 కేజీల నుంచి పై బడిన పార్సిళ్లకు ప్రతి కేజీకి రూ.2 ల చొప్పున. 51 నుంచి 100 కేజీల వరకు రూ. 300. 11 కేజీల నుంచి 30 కేజీల వరకు రూ. 150. 31 నుంచి 50 కేజీల వరకు.. రూ. 225.



దీనివల్ల నగరానికి వచ్చిన పార్సిళ్లను ఇళ్లకు లేదా కార్యాలయాలకు తీసుకెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. కూకట్‌పల్లి, గచ్చిబౌలి – సైబరాబాద్‌ ప్రాంతాలకు సంబంధించి డుంజో, సికింద్రాబాద్‌ ఏరియాకు చెందిన పార్సిళ్లను స్మార్ట్‌ షిప్‌ లాజిస్టిక్‌, హైదరాబాద్‌, ఓల్డ్‌ సిటీ సెక్టార్లలో అడ్నిగమ్‌ ఏజెన్సీలు పార్సిళ్లను వినియోగదారుల ఇంటికి డెలివరీ చేయనున్నాయి.



హోమ్‌ డెలివరీకి డుంజో డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్మార్ట్‌ షిప్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అడ్నిగమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏజెన్సీలతో టీఎస్‌ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో సెక్టార్‌ నుంచి ఒక్కో ఏజెన్సీ బాధ్యత తీసుకుంటాయి. చిన్న చిన్న వస్తువులకూ ఇష్టానుసారంగా చార్జీలు విధిస్తున్న ఆటో, ఇతర ప్రైవేటు వాహనాల డ్రైవర్ల తీరుకూ ఆర్టీసీ పార్సిల్‌ సేవలతో చెక్‌ పెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు