సీఎం అవకుండా అడ్డుకున్నారు : వీహెచ్ ఆవేదన

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆయన వాపోయారు. 1990లో సీఎం అయ్యే అవకాశం తనకు

  • Publish Date - May 6, 2019 / 08:37 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆయన వాపోయారు. 1990లో సీఎం అయ్యే అవకాశం తనకు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆయన వాపోయారు. 1990లో సీఎం అయ్యే అవకాశం తనకు వచ్చిందని వీహెచ్  చెప్పారు. బీసీ అనే కారణం చూపి ముఖ్యమంత్రి అవకుండా అడ్డుకున్నారని వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందన్నారు. బీసీ ముఖ్యమంత్రి అయిన రోజే  ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం  చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను  బర్తరఫ్ చెయ్యాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమాలను అణచివేయడం అప్రజాస్వామికమన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిందని, ఇంటర్‌ అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో  విచారణ జరపాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు