పీసీసీ చీఫ్ పదవి రేసులో నేనున్నా : వీహెచ్ సంచలనం

కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్

  • Publish Date - October 24, 2019 / 10:14 AM IST

కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్

కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డ్ మెజార్టీతో గెలుపొందారు. హుజూర్ నగర్ లో ఓటమి కాంగ్రెస్ శ్రేణులను షాక్ కి గురి చేసింది. ఫలితాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమిపై సమీక్ష జరగాలన్నారు. సమీక్ష జరిగే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయొద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓటమితో పార్టీ గుణపాఠం నేర్చుకోవాల్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుపైనా వీహెచ్ సీరియస్ అయ్యారు. రేవంత్ దగ్గర పైసలున్నాయని దూకుడు పెంచారని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభమని ప్రచారం చేశారని ఆరోపించారు.

హర్యానా తరహాలో తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తాను పీసీసీ అధ్యక్షుడి రేస్ లో ఉన్నానని చెప్పి సంచలనం రేపారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా అని చెప్పారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43వేల 233 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని చిత్తుగా ఓడించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలవటం ఇదే ప్రథమం. ఫస్ట్ టైం విక్టరీలోనే రికార్డ్ మెజార్టీ సాధించటం విశేషం. ఈ నియోజకవర్గంలో గతంలో 29వేల ఓట్ల మెజార్టీ అనేది అత్యధికం. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో గెలుపొంది రికార్డ్ నెలకొల్పారు.

సైదిరెడ్డికి 89వేల 459 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 55వేల 227 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామారావు కేవలం వెయ్యి 779 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి కేవలం వెయ్యి 440 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.