లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11 గురువారం తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11 గురువారం తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు రేపు సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికల రోజును సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్
ఏప్రిల్ 10న స్కూళ్లకు, ఏప్రిల్ 11న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పరిశ్రమలకు, ఫ్యాక్టరీలకు కూడా సెలవు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.ఎం.వీ రెడ్డి తెలిపారు.
సెలవు పాటించని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 11న ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలన్నీ వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ తెలిపారు.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి