అమ్మో…మళ్లీ చలి 

చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి చలి గాలులు పెరుగుతున్నాయి.

  • Publish Date - January 10, 2019 / 03:08 AM IST

చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి చలి గాలులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌ : చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి చలి గాలులు పెరుగుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ‘శీతల గాలుల ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోందని, తెల్లవారుజామున వాహనాల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదని’ ఆయన సూచించారు. బుధవారం తెల్లవారు జామున కుమురం భీం జిల్లా గిన్నెదరిలో 4.9, సిర్పూరు(యు)లో 5.2, సంగారెడ్డి జిల్లా అల్గోల్‌లో 5.4, ఆదిలాబాద్‌ జిల్లా బజారుహత్నూర్‌లో 6, కామారెడ్డి జిల్లా లచ్చపేటలో 6.2, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 7, శంకర్‌పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.