గణనాథుల ఉత్సవం వచ్చేసింది. వినాయకుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి మట్టి గణనాథుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంతోపాటు కమిటీలు భావించాయి. అందులో భాగంగా భారీ ఎత్తున మట్టి గణపతుల పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో మట్టి వినాయకులను మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులే స్వయంగా ఉచితంగా ఇస్తున్నారు.
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 33 సెంటర్లలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే 60వేల మట్టి విగ్రహాలను సిద్ధం చేశారు. ఆగస్టు 31వ తేదీ వరకు ఈ విగ్రహాలను HMDA పంపిణీ చేయనుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో హెచ్ఎండీఏ మొబైల్ వ్యాన్లలో మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేయడం ప్రారంభించింది. అంతేకాదు ..తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మరో 1.64 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచింది. మట్టి విగ్రహాలు కావాలనుకునే వారు ఈ క్రింది ఉన్న కేంద్రాలను సంప్రదించండి..మట్టి గణనాధులను ఉచితంగా పొందండి..
– జూబ్లీహిల్స్ – కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, ఆరోగ్యశ్రీ, రోడ్ నం.36 రత్నదీప్ సూపర్ మార్కెట్
– జూబ్లీహిల్స్ – పెద్దమ్మ దేవాలయం, రోడ్ నం.92 స్టార్ బక్స్
– మాదాపూర్ – శిల్పారామం, ఐకియా స్టోర్ దగ్గర, దుర్గం చెరువు, మైండ్ స్పేస్ జంక్షన్, మై హోం నవద్వీప
– గ్రీన్‌ల్యాండ్స్ హిందూ న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర, ప్రెస్ క్లబ్, గచ్చిబౌలి టోల్ బూత్ ఎగ్జిట్ పాయింట్
– సెక్రటేరియట్ ఎదురుగా, ఎన్‌టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, ప్రియదర్శిని పార్క్, ఇందిరా పార్క్
– ఉప్పల్ శిల్పారామం, సఫిల్‌గూడ లేక్ పార్క్ , అమీర్‌పేట మైత్రివనం
– సరూర్‌నగర్, వనస్థలిపురం రాజీవ్ గాంధీ పార్క్, కూకట్‌పల్లి మెట్రో
– తార్నాక హెచ్ఎండీఏ ఆఫీస్ దగ్గర, ఓయూ ఎంట్రన్స్ గేట్/ ఎన్‌సీసీ
– బేగంపేట కుందన్‌బాగ్, ఆరాంగడ్ జంక్షన్, నెక్నంపూర్
– కృష్ణకాంత్ పార్క్, నారాయణ గూడ పార్క్, భారతీయ విద్యాభవన్ సైనిక్‌పురి, వాయుపురి
ఇవికాక.. ఉప్పల్ ఎక్స్‌రోడ్, ఎల్బీనగర్, మదీనాగూడ, ఐడీఏ మల్లాపూర్, నాగోలు చౌరస్తా, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, జీడిమెట్ల రైతుబజార్, బాలానగర్-బీఆర్ దవాఖాన, సుచిత్ర ఎక్స్‌రోడ్స్.