హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గు చేటు

షాద్‌నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప

  • Publish Date - December 1, 2019 / 02:48 AM IST

షాద్‌నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప

షాద్‌నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప రాక్షసులను  బహిరంగంగా ఉరి తీయాలి లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు జరిగిన దారుణం అందరిని షాక్ కు గురి చేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. తీవ్రంగా ఖండించారు. ఆవేదన వ్యక్తం చేశారు. 

తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియాంక ఘటనపై స్పందించాడు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది ఎంతో సిగ్గుపడాల్సిన ఘటనగా చెబుతూ ట్వీట్ చేశాడు. ”హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో సిగ్గుచేటు. సమాజంలో మనం బాధ్యత తీసుకుని ఇలాంటి అమానవీయ ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది” అంటూ ట్వీట్ చేశాడు.

మరోవైపు డాక్టర్ ప్రియాంక రేప్ అండ్ మర్డర్ కేసులో నలుగురు నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకి తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హైటెన్షన్ వాతావరణం కనిపించింది. వేలాదిగా తరలివచ్చిన జనాలు నిందితులను తమకు అప్పగిస్తే.. వారి అంతు చూసి ప్రియాంకకు న్యాయం చేస్తామన్నారు.

తీవ్ర ఉద్రిక్తతుల నడుమ..నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులకు ఖైదీ నెంబర్లు కేటాయించారు జైలు అధికారులు. ఏ 1 మహ్మద్‌కు ఖైదీ నెంబర్ 1979, ఏ 2 జొల్లు శివకు ఖైదీ నెంబర్ 1980, ఏ 3 చెన్నకేశవులుకు ఖైదీ నెంబర్ 1981, ఏ 4 నవీన్ కుమార్‌కు ఖైదీ నెంబర్ 1982 కేటాయించారు.