మంత్రి పదవి ఇస్తామన్నా బీజేపీలోకి వెళ్లను

పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

  • Publish Date - September 10, 2019 / 08:04 AM IST

పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పినా బీజేపీలోకి వెళ్లను అని విష్ణు స్పష్టం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నామని, భవిష్యత్తులోనే కాంగ్రెస్ లోనే ఉంటానని విష్ణు తేల్చి చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు వార్తలొచ్చాయి. త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలతో విష్ణు చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై విష్ణు క్లారిటీ ఇచ్చారు.
 
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరికలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024లోపు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీలోకి చేరాలనుకునే వారిని.. కీలక నేతలకు బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు.