రెయిన్ అలర్ట్ : తెలంగాణకు వర్ష సూచన

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు.. ఇప్పుడు వర్ష సూచన. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసింది.

  • Publish Date - January 24, 2019 / 01:38 AM IST

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు.. ఇప్పుడు వర్ష సూచన. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసింది.

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు.. ఇప్పుడు వర్ష సూచన. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో తమిళనాడు తీరానికి దగ్గర 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి తెలిపారు. ఈ ఆవర్తనం నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో 2019, జనవరి 25వ తేదీ శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు