వెదర్ అప్ డేట్ : నేడు, రేపు వర్షాలు

ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Publish Date - February 10, 2019 / 01:50 AM IST

ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు కోమరిన్ నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు హైదరాబాద్ లో చలి తీవ్ర పెరిగింది. పగలు,  రాత్రి చలి గాలలు వీస్తున్నాయి. తెల్లవారుజామున చలి గాలుల తీవ్రత అధికంగా ఉంది.