గౌడల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : కేటీఆర్

గౌడ కులస్తుల అభివృద్ధికి అన్నిరకాలుగా కృషి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు.

  • Publish Date - January 4, 2020 / 04:22 PM IST

గౌడ కులస్తుల అభివృద్ధికి అన్నిరకాలుగా కృషి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు.

గౌడ కులస్తుల అభివృద్ధికి అన్నిరకాలుగా కృషి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన గౌడ సభకు హాజరైన ఆయన.. అన్ని వర్గాల ప్రజల ఉన్నతికి తమ ప్రభుత్వం పాటు పడుతోందని అన్నారు. తెలంగాణ మొత్తంగా ప్రగతి పథంలో నడుస్తోందన్నారు.

గౌడ సభ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నీరా తాగారు. సభకు హాజరైన మంత్రికి నిర్వాహకులు నీరా అందించారు. మరో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా నీరా సేవించారు. నేను నీరాకు ఫ్యాన్ అయిపోయాని కేటీఆర్‌ అన్నారు. ఇకపై పెట్టుబడుల కోసం హైదరాబాద్ వచ్చే విదేశీ ప్రతినిధులకు నీరా రుచి చూపిస్తామని చెప్పారు. 

గౌడల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గౌడలకు మోపెడ్ల అంశాన్ని బడ్జెట్ లో పెడతామని తెలిపారు. బీసీలంటే చేపలు, గొర్రెలు, బర్రెలేనా అంటూ ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని అన్నారు. రెండో హరిత విప్లవం రావాలని దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందేలా గ్రీన్ విప్లవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. 

సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. తెలంగాణలో కోటి ఎకరాలు సాగు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యం అన్నారు. రాష్ట్ర సంపదను పెంచుతూ పేదలకు పంచుకున్నామని చెప్పారు. తెలంగాణ పురోగతికి ఏపీ సీఎం హ్యాట్సాప్ చెప్పారని తెలిపారు.