లోటస్ పాండ్ ఖాళీ : జగన్ C/O అమరావతి

పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

  • Publish Date - May 13, 2019 / 10:26 AM IST

పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

హైదరాబాద్ నుంచి జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేరాఫ్ లోటస్ పాండ్. ఎందుకంటే అక్కడే పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పుడు లోటస్ పాండ్ ఖాళీ చేసి అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారు. పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయానికి మార్పు చేస్తున్నారు. మే 13వ తేదీ నుంచి సామాను తరలింపు కూడా మొదలుపెట్టేశారు. పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా తాడేపల్లికి మారిపోయింది.

మే 21వ తేదీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఆ రోజు నుంచే జగన్ పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను అమరావతి నుంచే నిర్వహించనున్నారు. మే 23వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అందుకు రెండు రోజుల ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అమరావతి అని డిసైడ్ అయిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.

రిజల్ట్స్ ఎలా ఉన్నా.. మరో ఐదేళ్లు హైదరాబాద్ లోనే జగన్ ఉంటారనే ఆరోపణలు వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ.. పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు నిర్వహణను కూడా ఫలితాలకు ముందే అమరావతికి షిఫ్ట్ చేయటం ఆసక్తిగా మారింది.