Hunter killed Drones: భారత మిలటరీ అమ్ముల పొదిలోకి హంటర్ కిల్లర్ డ్రోన్లు

భారత సైన్యం అమ్ముల పొదిలోకి కొత్తగా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 బి సీ గార్డియన్ హంటర్ కిల్లర్ డ్రోన్లు చేరనున్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో యూఎస్ తయారు చేసిన ఈ డ్రోన్ల కొనుగోలుకు వచ్చే వారం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదరనుంది...

భారత అమ్ముల పొదిలోకి హంటర్ కిల్లర్ డ్రోన్లు

India hunter killed drone Acquisition: భారత సైన్యం అమ్ముల పొదిలోకి కొత్తగా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 బి సీ గార్డియన్ హంటర్ కిల్లర్ డ్రోన్లు చేరనున్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో యూఎస్ తయారు చేసిన ఈ డ్రోన్ల కొనుగోలుకు వచ్చే వారం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదరనుంది. దీంతో 31 అధునాతన ఎంక్యూ-9బి సీ గార్డియన్ హంటర్ కిల్లర్ డ్రోన్ల కొనుగోలు మెగా ప్రాజెక్టుపై ప్రకటన వెలువడనుంది.

రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం

కిల్లర్ డ్రోన్ల(Hunter killed Drone) కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.రూ.29,000కోట్ల వ్యయంతో యూఎస్ నుంచి విదేశీ మిలటరీ సేల్స్ కార్యక్రమం కింద ఈ అధునాతన హంటర్ కిల్లర్ డ్రోన్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు.

సరిహద్దుల్లో సవాళ్లకు చెక్

హంటర్ కిల్లర్ డ్రోన్ల రాకతో సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ దేశాలతో ఎదురవుతున్న సవాళ్లకు చెక్ పెట్టవచ్చు. (game changer for india) ఈ డ్రోన్లలో ఇండియన్ నేవికి 15, ఆర్మీకి 8, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి 8 చొప్పున ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. హిందూమహాసముద్రంతోపాటు భూమి సరిహద్దుల్లో లాంగ్ రేంజ్ లో దాడులు చేసేందుకు వీలుగా మిస్సైళ్లు, స్మార్ట్ బాంబులు కావాలని గత కొంత కాలంగా భారత సైన్యం కోరుతోంది.

ఉగ్రవాదులపై దాడులకు ఉపయోగం

మన పొరుగున ఉన్న చైనా దేశం కాయ్ హాంగ్ -4, వింగ్ లూంగ్ 2 డ్రోన్లను తన మిత్రదేశమైన పాకిస్థాన్ కు సప్లయి చేసింది. కొన్ని నాటో దేశాలతో పాటు అమెరికా ఈ అధునాతన డ్రోన్లను తయారు చేసింది. ఈ అధునాతన కిల్లర్ డ్రోన్లను అఫ్ఘానిస్థాన్,ఇరాక్ ప్రాంతాల్లోని ఉగ్రవాదులపై దాడులకు ఉపయోగించారు. భారత నావికాదళం 2020 సెప్టెంబరు నుంచి రెండు సీ గార్డియన్ కిల్లర్ డ్రోన్లను లీజుపై వినియోగించుకుంటోంది. ఈ డ్రోన్లు 5,500 నాటికల్ మైళ్ల వరకు 40వేల అడుగుల ఎత్తులో ప్రయాణించి సరిహద్దుల్లో చైనీస్ మిలటరీ కార్యకలాపాలను నియంత్రిస్తోంది.

ఈ కిల్లర్ డ్రోన్లతో యూఎస్ ఎవరిని హతమార్చిందంటే…

ఎంక్యూ-9 బి డ్రోన్ ద్వారానే కాబూల్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని అమెరికా హతమార్చింది. మొత్తం మీద ప్రధాని మోదీ అమెరికా దేశ పర్యటనతో 31 అధునాతన హంటర్ కిల్లర్ డ్రోన్లు మన దేశానికి త్వరలో రానున్నాయి. వీటి రాక భారత మిలటరీకి చెందిన త్రివిధ దళాలకు గేమ్ ఛేంజర్ గా(game changer for india) నిలవనుంది.

ట్రెండింగ్ వార్తలు