Amarnath Yatra : కశ్మీర్ లోయలో భారీవర్షాలు..అమరనాథ్ యాత్రకు బ్రేక్

భారీవర్షాలు, వరదల వల్ల అమరనాథ్ యాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు....

Amarnath Yatra

Amarnath Yatra : భారీవర్షాలు, వరదల వల్ల అమరనాథ్ యాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. (Amarnath Yatra Suspended) భారీవర్షాల వల్ల పవిత్ర గుహలోకి యాత్రికులు ఎవరూ వెళ్లలేరని, దీంతో 3,200 మంది యాత్రికులను నున్వాన్ పహల్గామ్ క్యాంపు వద్ద, 4,000 మంది యాత్రికులను బల్తాల్ క్యాంపు వద్ద నిలిపివేశామని అధికారులు తెలిపారు. (Due To Heavy Rainfall In Kashmir Valley)

Ajit Agarkar Love Story : బీసీసీఐ కొత్త సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్, ముస్లిం గాళ్‌ఫ్రెండ్ ప్రేమ కథ

వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 80 వేల మంది భక్తులు యాత్రను పూర్తి చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8, 9 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. కాగా 8వ బ్యాచ్ 7,010 మంది యాత్రికులు శుక్రవారం బఘ్‌వతి నగర్ బేస్ క్యాంపు నుంచి 247 వాహనాల్లో జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరారు.